హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యటన ముగించిన రాష్ట్రపతి

KRISHNA: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం విజయవాడ పర్యటన ముగించుకుని ఢిల్లీ బయలుదేరారు. జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన అనంతరం ఓ స్టాల్‌లో యూపీఐ ద్వారా చీర కొనుగోలు చేసి, స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి భోజనం చేశారు. గన్నవరం విమానాశ్రయంలో హోంమంత్రి అనిత ఆమెకు వీడ్కోలు పలికారు. అంతకుముందు బుధవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు.