హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగు కాలువ కాదు..రహదారే!

సంగారెడ్డి పట్టణం 12వ వార్డు ద్వారకానగర్ కాలనీలో మురుగునీరు ప్రధాన రహదారిపై పారుతోంది. వాహనదారులు, విద్యార్థులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన, దోమల బెడదతో వ్యాధులు ప్రబలుతాయని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని, అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని స్థానికులు హెచ్చరించారు.