హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యాపారులపై రాజకీయ ఒత్తిడి సరికాదు: మున్సిపల్ ఛైర్మన్

GDWL: రాజకీయ కక్షలతో వ్యాపారులను భయాందోళనలకు గురిచేయడం తగదని, అయిజ సమగ్రాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మున్సిపల్ ఛైర్మన్ సీఎం సురేష్ అన్నారు. గురువారం అయిజ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైస్ ఛైర్మన్ మాల నరసింహులతో కలిసి మాట్లాడారు. అప్పులు తెచ్చి వ్యాపారాలు చేసుకునే పేదలపై రాజకీయ ఒత్తిళ్లు తేవడం సరికాదని అన్నారు.