హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

VSP: చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదో రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి, శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా అలంకరించి పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.