హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మలేరియా, డెంగీపై ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన

అన్నమయ్య: సుండుపల్లి మండలం ఈడిగపల్లిలో డాక్టర్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, నీటి తొట్టెలు, కూలర్లు, పాత టైర్లను తరచూ శుభ్రం చేయాలని సూచించారు. దోమతెరలు వాడుతూ పిల్లలకు దోమల నుంచి రక్షణ కల్పించాలని తెలిపారు.