NDL: డోన్ పట్టణంలో గురువారం ఓ హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధించినట్లు సీఐ రాజగోపాల్ నాయుడు తెలిపారు. పోచ శ్రీకాంత్ రెడ్డిని నరసింహ, చంద్రశేఖర్, నాగరత్నమ్మ అనే ముగ్గురు నిందితులు దారుణంగా హత్య చేసినట్లు కోర్టులో సాక్షాలు రుజువయ్యాయి. సాక్షాలు ఆధారంగా జడ్జి లీలావతి ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధించినట్లు సీఐ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు


