హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారి హన్వికను పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

WNP: వనపర్తి పట్టణంలోని 16వ వార్డుకు చెందిన జర్నలిస్టు తైలం అరుణ్ రాజ్ కుమార్తె హన్విక (8) ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గురువారం పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.