హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయ్: BRS

GDWL: కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ కోతల వల్ల పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోతూ అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని BRS గద్వాల నియోజకవర్గ ఇన్‌‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు మండిపడ్డారు. గురువారం గద్వాలలో కేటీఆర్ పిలుపు మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజూ 6-7 గంటలు కూడా కరెంట్ రాకపోవడం, లో-వోల్టేజీతో మోటర్లు కాలిపోవడం దారుణమన్నారు.