హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోస్టల్ ఉద్యోగుల ధర్నా విజయవంతం

VZM: గ్రామీణ డాక్ సేవకుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని అఖిలభారత గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ డివిజన్ కార్యదర్శి తుంపిల్లి ఉపేంద్ర డిమాండ్ చేశారు. గురువారం విజయనగరం కోట వద్ద ఉన్న ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఒకరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ ఎనిమిదవ వేతన కమిటీని గ్రామీణ డాక్ సేవకులకు వెంటనే అమలు చేయాలని కోరారు.