హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మేయర్ పదవి యాదవులకే కేటాయించాలి'

చిత్తూరు నగర మేయర్‌ పదవిని యాదవులకు కేటాయించాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నాయకులు కోరారు. బీసీ జనరల్‌ కేటగిరీకి మేయర్‌ స్థానం కేటాయించిన నేపథ్యంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు అశోక్‌ ఆనంద్‌ యాదవ్‌కు అవకాశం కల్పించాలన్నారు. జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన యాదవులకు ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కీలక పదవులు దక్కలేదని పేర్కొన్నారు.