హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం

NDL: బనగానపల్లె మండలం జయజ్యోతి సిమెంట్ పరిశ్రమ వద్ద టిప్పర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ బోయ ఉలవ మద్దిలేటి కుటుంబానికి యజమాని రేగటి రామమోహన్‌రెడ్డి ఆర్థికసాయం గురువారం అందించారు. ఈ విషయాన్ని మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివరాం తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.