హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో రూ.4 కోట్లతో వాసవి మాత అలంకరణ

WG: భీమవరం పట్టణంలోని శ్రీ త్యాగరాజ భవనంలో శ్రీ వాసవి మాత అమ్మవారు అత్యంత వైభవంగా దర్శనమిచ్చారు. అమ్మవారిని సుమారు రూ. 4 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు, బంగారం బిస్కెట్లు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా మహాలక్ష్మి రూపంలో అలంకరించారు. ఈ దివ్య రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.