హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపవాస దీక్ష ప్రార్థనల ముగింపు సభకు పటిష్ట బందోబస్తు

MNCL: కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి మైదానంలో ఉపవాస దీక్ష ప్రార్థనల ముగింపు సభ సందర్భంగా చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను DCP భాస్కర్, గురువారం పరిశీలించారు. సభకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.