CTR: ఎస్ఆర్పురం మండలం తయ్యూరు పాయకట్టులోని శ్రీ ఆరిమాని గంగమ్మ తల్లి దసరా ఉత్సవాలు ఐదో రోజు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మధ్యాహ్నం అన్నదానం, రాత్రి అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారి పురవీధుల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ జలంధర్ నాయుడు, ఈవో వెంకట రాయల్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాయత్రీ దేవి అలంకారంలో గంగమ్మ తల్లి


