కృష్ణా: విజయవాడలో వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణను గుడివాడ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాధాకృష్ణ జనసేనలో చేరిన సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురూ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాధాకృష్ణకు పుష్పగుచ్ఛం అందజేసిన శ్రీకాంత్


