GDWL: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ డైరెక్టర్ సీఎం హనుమంతరావు అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో భక్తుల కోసం ఆర్జిత ప్రసాదాలు తయారు చేసే వంటశాలను పరిశీలించి, సమస్యలను తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
తెలంగాణ
జోగులాంబను దర్శించుకున్న దేవాదాయ శాఖ డైరెక్టర్


