E.G: జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో గురువారం గ్రీనెక్ ఆధ్వర్యంలో జాబ్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. కౌశలం ప్రోగ్రామ్ ద్వారా జరిగిన ఈ ప్రక్రియకు 122 మంది హాజరయ్యారు. సర్వే, రెండు దశల పరీక్షల్లో అర్హత సాధించిన వారిలో 45 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయని అధికారిణి రత్నకుమారి స్పష్టం చేశారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి లో జాబ్ మేళా... 45 మందికి ఉద్యోగాలు


