హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐతం కళాశాలలో ఈ సెల్ నూతన లోగో ఆవిష్కరణ

SKLM: టెక్కలి సమీప ఐతం ఇంజనీరింగ్ కళాశాలలో ఈ-సెల్ నూతన లోగోను డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి.నాగేశ్వరరావు గురువారం ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, అంకుర పరిశ్రమల ఆలోచనలు పెంపొందించడమే లక్ష్యమన్నారు. విద్యార్థులు కొత్త ఆలోచనలతో స్టార్టప్‌లు స్థాపించి ఉపాధి కల్పించాలని సూచించారు. ప్రిన్సిపాల్ డా.ఎ.ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.