హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెస్టారెంట్‌లో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు

MBNR: జడ్చర్ల NH-44 కర్నూల్ రోడ్డులోని ఫోర్ సీజన్స్ రెస్టారెంట్‌లో కమిషనర్ గిరీష్ తనిఖీలు నిర్వహించారు. వంటగది అపరిశుభ్రత, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పాత మాంసాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపాలను 48 గంటల్లో సరిచేయాలని నోటీసులు జారీ చేశారు. పరిశుభ్రత పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.