హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేతుల శుభ్రతపై సీఎంసీ అవగాహన

MDCL: శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో సీఎంసీ ఆధ్వర్యంలో చేతుల శుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. భోజనానికి ముందు, మరుగుదొడ్డి వాడిన తర్వాత, వ్యర్థాలను తాకిన అనంతరం సబ్బుతో చేతులు కడుక్కోవాలని పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలకు సూచించారు. ఇన్ఫెక్షన్ల నివారణకు ఈ అలవాటును ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు.