NZB: ఆర్మూర్ (M)లోని అంకాపూర్ లాలన వృద్ధాశ్రమాన్ని సీపీ పి. సాయిచైతన్య గురువారం సందర్శించారు. ఆశ్రమంలో ఉంటున్న 60 మంది వృద్ధుల ఆరోగ్య, జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారికి దుస్తులు పంపిణీ చేసి, స్వయంగా భోజనం వడ్డించారు. ప్రముఖ వైద్యులతో వైద్య పరీక్షలు చేయించారు. వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: వృద్ధాశ్రమంలో పోలీస్ కమిషనర్ సేవా కార్యక్రమం


