హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుగంధ ద్రవ్యాల సాగుతో అధిక ఆదాయం

ASR: సుగంధ ద్రవ్యాల సాగు, నాణ్యత, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌పై పాడేరులో గురువారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాఫీతో పాటు అంతర పంటలు, మసాలా దినుసుల సాగుతో ఆదాయం పెంచుకోవాలని అధికారులు సూచించారు. పంటకోత అనంతర నిర్వహణ, నాణ్యత ప్రమాణాలు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై నిపుణులు వివరించారు. ఇందులో వ్యవసాయ, ఉద్యానశాఖ, కాఫీ బోర్డు అధికారులు పాల్గొన్నారు.