JGL: మల్యాల మండల కేంద్రానికి చెందిన మల్యా అశోక్ అనే ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. గురువారం రోజువారీ విధులు నిర్వహిస్తుండగా అతనికి ఓ ఐఫోన్ దొరికింది. ఫోన్లోని వివరాల ఆధారంగా అది చొప్పదండికి చెందిన శేఖర్ అనే వ్యక్తిదిగా గుర్తించి, తిరిగి అతనికి సురక్షితంగా అందజేశాడు. విలువైన ఫోన్ను తిరిగి ఇచ్చిన ఆటో డ్రైవర్ నిజాయితీని పలువురు అభినందించారు.
తెలంగాణ
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్


