హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారికి బోనాల సమర్పణ వేడుకలు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి)లో ఆజాద్ దుర్గాదేవి సంఘం ఆధ్వర్యంలో గురువారం అమ్మవారికి బోనాల సమర్పణ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు బోనాలు, మంగళహారతులతో ఊ రేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సంఘ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.