హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరెస్టులు ఖండిస్తూ సీపీఎం నిరసన

AKP: నక్కపల్లిలో సీపీఎం పార్టీ నాయకుల అరెస్ట్‌ను ఖండిస్తూ నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం వద్ద గురువారం సీపీఎం నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు మాట్లాడుతూ.. పోలీస్ నిర్బంధనాన్ని విడనాడాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళుతున్న నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొన్నారు.