హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చేతుల శుభ్రతతో అంటువ్యాధులకు అడ్డుకట్ట'

అన్నమయ్య: పీలేరు పట్టణంలోని సైనిక నగర్‌లో ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సబ్బుతో 20 సెకన్ల పాటు ఆరు పద్ధతుల్లో చేతులు కడుక్కోవడం ద్వారా అంటువ్యాధులను నివారించవచ్చని తలుపుల పీహెచ్సీ వైద్యాధికారి డా. చంద్రశేఖర్ నాయక్ సూచించారు. భోజనానికి ముందు, కాలకృత్యాల తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు.