RR: ఆదిభట్ల పోలీస్ స్టేషన్ను శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, శాంతిభద్రతల పరిరక్షణకు పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
ఆదిభట్ల పీఎస్ను తనిఖీ చేసిన డీసీపీ


