హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ మోటార్లపై వాటర్ బోర్డు కొరడా

MDCL: కూకట్‌పల్లి పరిధిలోని వివేకానందనగర్ కాలనీ, గాయత్రినగర్‌లో తాగునీటి పైపులైన్లకు అక్రమంగా అమర్చిన 12 విద్యుత్ మోటార్లను వాటర్ బోర్డు విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. నేరుగా మోటార్లతో నీటిని తోడుకోవడం వల్ల నీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు ప్రెషర్ తగ్గుతోందని అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.