హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌లు ప్రారంభం'

KDP: ప్రొద్దుటూరులో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషనర్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ఈ నెల 16 నుంచి నామినేషన్‌లు ప్రారంభమవుతాయని, 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.