VKB: ప్రజా సంక్షేమ పథకాలు అర్హులకు అందాలంటే స్మార్ట్ రేషన్ కార్డులు అవసరమని దేవరంపల్లి గ్రామ సర్పంచ్ అంత నొల్ల అశోక్ అన్నారు. గురువారం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వం సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
తెలంగాణ
'అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి'


