హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాలా ఆక్రమణల తొలగింపునకు హైడ్రా ఆదేశాలు

MDCL: ఫతేనగర్, బాలానగర్ ప్రాంతాల్లో ముంపు సమస్య పరిష్కారానికి హైడ్రా చర్యలు చేపట్టింది. కూకట్‌పల్లి నాలాను వెడల్పు చేయాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఫతేనగర్ వద్ద 40 మీటర్లు ఉండాల్సిన నాలా ఆక్రమణల కారణంగా 9 మీటర్లకు కుదించుకుపోయింది. నాలా సరిహద్దులను గుర్తించి, ఆక్రమణలను తొలగించాలని స్పష్టం చేశారు.