హైదరాబాద్: 28°C
వ్యాపారం

డేటా ట్రాఫిక్‌లో 60 శాతం వాటా జియోదే: అంబానీ

డేటా ట్రాఫిక్‌లో 60 శాతం వాటా జియోదేనని జియో మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ వెల్లడించారు. చైనా తర్వాత అతిపెద్ద 5జీ బేస్ మనదేనన్నారు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకే డేటా అందిస్తున్నట్లు తెలిపారు. భారత్‌ను ఒక అగ్రగామి డిజిటల్ సమాజంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. 2031 నాటికి 1.4 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.