రుణగ్రహీతలకు SBI షాకిచ్చింది. ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చేలా రుణ వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. MCLR రేట్లను ఎంపిక చేసిన టెన్యూర్లపై 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. EBLR 7.90% నుంచి 8.15%కి, RLLR 7.50% నుంచి 7.75%కి పెరిగింది. అలాగే BPLR వార్షికంగా 14.65% వద్ద కొనసాగుతోందని బ్యాంకు తెలిపింది. ఈ పెంపుతో హోమ్, ఆటో, పర్సనల్ లోన్ల EMIలు మరింత భారం కానున్నాయి.
వ్యాపారం
SBI కస్టమర్లకు షాక్


