హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,265 పాయింట్ల లాభంతో 74,048 వద్ద.. నిఫ్టీ 348 పాయింట్ల లాభంతో 22,970 వద్ద ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్ర, ICICI బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, HCL టెక్, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. నెస్లే, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ట్రెంట్, జియో ఫైనాన్షియల్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.