హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేల్ టీడీపీలో చైర్మన్ అభ్యర్థిపై ఉత్కంఠ

KDP: బద్వేల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రకటనపై బద్వేల్ టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఇన్‌చార్జి సూర్యనారాయణ రెడ్డి అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం చేయడంతో నాయకులు, కార్యకర్తల్లో సందిగ్ధత నెలకొంది. రితీష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి వర్గాల మధ్య సమన్వయంపై చర్చ జరుగుతుండగా, అభ్యర్థి ఎంపికపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.