SRCL: ముస్తాబాద్ మండలం అవునూర్లో గురువారం డాక్టర్ ఆఫీజ ఆధ్వర్యంలో టీబీ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 60 మంది హైరిస్క్ వ్యక్తులకు ఎక్స్రేలు తీసి, నమూనాలు సేకరించారు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స అందించడమే శిబిరం లక్ష్యమని డాక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నక్కదాసరి రవి, హెచ్ఈఓ భూమయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
అవునూర్లో టీబీ నిర్ధారణ శిబిరం


