హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావణ దహన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్

ADB: ఆదిలాబాద్‌లోని దస్నాపూర్ రావణ దహనం మైదానాన్ని మున్సిపల్ చైర్మన్ బండారి అనూష గురువారం పరిశీలించారు. విజయదశమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లైటింగ్, స్టేజ్, పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దసరా పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.