హైదరాబాద్: 28°C
క్రీడలు

100 సిక్సర్ల క్లబ్‌లో సంజూ ఎంట్రీ

WIతో నాలుగో T20లో 4 సిక్సర్లు కొట్టడం ద్వారా సంజు శాంసన్ అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత తరఫున ఈ ఘనత సాధించిన ఆరో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్(205) టాప్‌లో కొనసాగుతుండగా, సూర్య(179), అభిషేక్(142) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే, ఓవరాల్‌గా T20Iల్లో 100 సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో సంజు 47వ స్థానంలో నిలిచాడు.