హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ నిజమైన 'హిట్‌మ్యాన్': సమిత్ పటేల్

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సమిత్ పటేల్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ పవర్ చాలా డైనమిక్‌గా, చూడటానికి అద్భుతంగా ఉంటుందని కొనియాడాడు. రోహిత్ ఒక శక్తివంతమైన నాయకుడని, టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరని పేర్కొన్నాడు. అలాగే, రోహిత్‌ను నిజమైన హిట్‌మ్యాన్‌గా అభివర్ణించాడు.