హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాసవి అమ్మవారిని దర్శించుకున్న బండ్ల గణేష్

GNTR: తెనాలి బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురువారం దర్శించుకున్నారు. తెనాలి వచ్చిన ఆయన ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని, ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.