హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శాస్త్ర సాంకేతిక రంగంలో కలాం చేసిన సేవలు మరువలేనివి'

ADB: శాస్త్ర సాంకేతిక రంగంలో దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం చేసిన సేవలు మరువలేనివని గుడిహత్నూర్ నాయకులు పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కలాం జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. యువత కలాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మారుతి, జైపాల్, సమీర్ ఉన్నారు.