హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ అంబటికు పోలీసుల నోటీసులు

GNTR: స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. మరో కొత్త కేసు విచారణ నిమిత్తం ఆయనకు ఈ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల హడావుడి కొనసాగుతున్న వేళ ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు పూర్తి వివరాలు తదితర అంశాలపై ఇంకా స్పష్టత లేదు.