హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిబంధనలపై అవగాహనతో విధులు నిర్వహించాలి: కలెక్టర్

మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికల్లో అధికారులు నిబంధనలపై అవగాహనతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. గురువారం మదనపల్లె దొంతి లేఔట్‌లోని నూతన ఎన్నికల అథారిటీ భవనంలో ఎన్నికల అధికారులకు శిక్షణ జరిగింది. నామినేషన్‌ల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ, ఉపసంహరణ, తుదిజాబితా, గుర్తుల కేటాయింపుపై అవగాహన అవసరమన్నారు.