ASF: కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు గురువారం పడుకుని నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న నెల పూర్తి జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు రూ.5 వేలు అడ్వాన్స్ ఇస్తామనగా కార్మికులు తిరస్కరించారు. రేపటిలోగా వేతనాలు ఇవ్వకుంటే విధులు బహిష్కరిస్తామని, నీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగేలా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
కాగజ్నగర్ జీతాల కోసం కార్మికుల ధర్నా


