హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుజూరాబాద్ తహశీల్ ఆఫీసులో నాగుపాము

KNR: హుజూరాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఉదయం నాగుపాము కలకలం రేపింది. అటెండర్ సమ్మయ్య వరండాలో పామును గుర్తించగా, అది రికార్డు గదిలో దాక్కుంది. దరఖాస్తుదారులను లోపలికి రానీయలేదు. స్నేక్ క్యాచర్ అఫ్జల్ పామును పట్టి దూరంగా వదిలారు. కార్యాలయం వెనుక చెత్త, పిచ్చిమొక్కలే కారణమని, శుభ్రం చేయించాలని సిబ్బంది కోరారు.