హైదరాబాద్: 28°C
తెలంగాణ

యార్డ్ గోడ కూల్చివేతపై బీజేపీ నిరసన

NRML: నిర్మల్ మార్కెట్ యార్డ్ ప్రహరీ గోడ కూల్చివేతపై బీజేపీ నేతలు, కౌన్సిలర్లు గురువారం అక్కడే నిరసనకు దిగారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నవారు, వారికి అండగా ఉన్న ప్రజాప్రతినిధులు, పట్టించుకోని అధికారులపై నినాదాలు చేశారు. గోడ కూల్చినవారిపై చర్యలు తీసుకుని పనులు నిలిపివేయాలని, లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.