హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసభ్య మెసేజులతో వేధింపులు.. ఆకతాయి అరెస్ట్

NZB: మహిళకు అసభ్యకర మెసేజీలు పంపుతూ వేధిస్తున్న వ్యక్తిని షీ టీమ్ సిబ్బంది గురువారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడ్ని ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్ పోలీసులు హెచ్చరించారు. మహిళల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.