హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూపతిపూర్‌ను సందర్శించిన ట్రైనీ కలెక్టర్ హరిణి

JGL: రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామాన్ని ట్రైనీ కలెక్టర్ హరిణి సందర్శించారు. ఈ సందర్భంగా దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్ గుర్రం భావన, మహేందర్ గౌడ్ పాల్గొన్నారు.