హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత కార్పొరేషన్ కొత్త కార్యాలయం ప్రారంభం

HYD: నాంపల్లిలోని చేనేత భవన్‌లో తెలంగాణ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి, చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, చేనేత శాఖ అధికారులు పాల్గొన్నారు.