హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబానికి నిత్యావసర సరుకుల అందజేత

JGL: రాయికల్ మండలం ధర్మాజీపేట్ గ్రామానికి చెందిన డాకూరి భరత్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. అంత్యక్రియల సందర్భంగా గ్రామ స్నేహితుల బృందం సహకారంతో నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాకిటి గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ పాలిక సుధాకర్, బలుసు రంజిత్, మాజీ ఉపసర్పంచ్ పాలకుర్తి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.